In a tragic incident, at least 16 persons lost life after a boat capsized in Krishna River at Ibrahimpatnam near Vijayawada on Sunday. The rescued persons have been admitted to Government General Hospital. Over 38 people including the boat driver were in the boat at the time of the incident
కృష్ణా నదిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిందని స్థానికులు, మత్స్యకారులు సమాచారం ఇచ్చిన అరగంటవరకు ఎవరూ సంఘటనా స్థలికి రాలేదని వారు చెప్పారు. వచ్చిన తరువాత కూడా బాధితులను రక్షించడంలో ఆలస్యం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మత్స్యకారులు, స్థానికులే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారని పలువురు వ్యాఖ్యానించారు. మృతుల గాలింపు సమయానికి వచ్చిన అధికారులు.. తీరిగ్గా కార్యక్రమాలు వీక్షించారని ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని, ఎన్డీఆర్ఎఫ్ దళాలు మాత్రం వచ్చిన వెంటనే గాలింపు చేపట్టాయని చెప్పారు. బోటు అనుమతిచ్చి అధికారులే ఈ ప్రమాదానికి కారణమయ్యారని స్థానికులు ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే పడవ బోల్తా పడి 17మంది ప్రాణాలు కోల్పోయారిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గల్లంతయ్యారు.అయితే ఈ ప్రమాదానికి పూర్తిగా పర్యాటక శాఖదే బాధ్యతని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కారణం ప్రమాదం మొదటి నుంచి చివరి వరకు పర్యాటక శాఖ సిబ్బందిదే కర్త కర్మ క్రియ అనేది స్థానికులు చెబుతున్న సమాచారం బట్టి అర్ధమవుతోంది. కేవలం పున్నమి ఘాట్ నుంచి భవాని ఐలాండ్ వరకు ఇద్దరు పాసింజర్లను చేర్చడానికి మాత్రమే స్పీడ్ బోటుకు వారు అనుమతి తీసుకున్నారు.