Polavaram Project : కేవీపీ పిటిషన్‌ : కేంద్రం, బాబు కు చెక్ !

Oneindia Telugu 2017-11-22

Views 555

A division bench of the High Court on Tuesday issued notice to the Centre, asking it to respond to a PIL which questioned limiting its financial liability with regard to the Polavaram irrigation project to the extent of project cost as on April 1, 2014 despite it being declared as a national project.

మూడున్నరేళ్లుగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న దాగుడుమూతలకు ఇకనైనా చెక్ పెడతారా? లేదా? తేలనున్నది. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీన మేషాలు లెక్కించాయి. తీరా మళ్లీ ఎన్నికలు దగ్గరకు వస్తుండటంతో ఒకరిపై మరొకరు పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. అందులో భాగంగానే ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి వరప్రదాయినిగా భావించే 'పోలవరం' ప్రాజెక్టుపై కాపర్ డ్యామ్‌ల నిర్మాణం పూర్తిచేసి.. ఆగమేఘాలపై ప్రజల సెంటిమెంట్‍ను తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నది ఏపీ సీఎం చంద్రబాబు ఆరాటం. అందుకోసమే కేంద్రం ఆదేశాలు తోసి రాజని కాపర్ డ్యామ్‌ల నిర్మాణం తదితర పనుల కోసం కొత్తగా టెండర్లను ఆహ్వానించారు. దీనిపైనా కేంద్రం ఆగ్రహించింది. తమ అనుమతి లేకుండా ఎలా చేస్తారని నిలదీసింది. కేంద్ర క్యాబినెట్‌లో మార్పుల్లో భాగంగా పోలవరం బాధ్యత నితిన్ గడ్కరీకి అప్పగించారు ప్రధాని మోదీ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS