Sai Pallavi’s acting prowess has impressed critics and audiences immensely in her short career. The trailer of her upcoming Tamil film Karu was unveiled recently. Naga Shourya who is known for his work in Telugu films.
సాయి పల్లవి పెళ్లి ఫోటో అంటూ ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అయితే దీనిపై ఆరా తీస్తే తెలిసింది..సాయి పల్లవి పెళ్లి జరిగింది నిజంగా కాదు.. అది సినిమా కోసం జరిగిన వివాహం.. అని.మరి ఈ పెళ్లి జరిగింది మాత్రం నాగశౌర్యతో.. తమిళ చిత్రం కరు కోసం. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలై విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ చిత్రంలో జరిగిన నాగశౌర్య, సాయి పల్లవి పెళ్లి ఫోటోలు చర్చనీయాంశమయ్యాయి.
ప్రేమమ్ మలయాళ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచమైన సాయి పల్లవి.. ఆ తర్వాత ఫిదా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ప్రస్తుతం నానితో ఎంసీఏ చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో నాగశౌర్యతో నటించిన హారర్ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ధనుష్తో మారి2 చిత్రంలో కూడా నటిస్తున్నది.
అబార్షన్, భ్రూణ హత్యల కథాంశంతో కరు చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా రూపొందించింది. ఈ చిత్రంలో సాయి పల్లవి ఆధునిక యువతిగా కనిపించిది. ఆమె పాత్ర తీరు ఆకట్టుకునేలా, ఉద్వేగభరితంగా కనిపిస్తున్నది. కరు చిత్రానికి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.