After 14 years, Dil Raju and Hero Nitin teamed up. Movie name is Srinivasa Kalyanam. Directed by Sathamanam Bhavati fame Satish Vegnesha. This project goes to sets in 2018 March.
యువ కథానాయకుడు నితిన్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాణసంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ కొత్త సినిమా నిర్మించబోతోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రానికి "శ్రీనివాస కల్యాణం" అనే పేరు నిర్ణయించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌పై సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
14 ఏళ్ల క్రితం దిల్ రాజు, నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'దిల్' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. నితిన్‌ను ఆ చిత్రం మరోస్థాయికి తీసుకెళ్తింది. అలాంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన శతమానంభవతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాతీయస్థాయిలో 'ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం'గా స్వర్ణకమలం అవార్డ్ అందుకుంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం విశేషం.
2018 మార్చిలో షూటింగ్ ప్రారంభించుకోబోతున్న ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శ్రావణ మాసంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు, మిగిలిన నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే తెలియచేస్తామని యూనిట్ తెలియచేసింది.