"Indrasena" Movie Public Talk "ఇంద్రసేన" మూవీ పబ్లిక్ టాక్..!

Filmibeat Telugu 2017-11-30

Views 11

Vijay Antony's latest movie is Indrasena. G Srinivasan is the director. This movie produced by Fatima Vijay Antony and Raadhika Sarathkumar under the banners Vijay Antony Film Corporation and R Studios banner.

బిచ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైన నటుడు, సంగీత దర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోని తాజా చిత్రం ఇంద్రసేన. ఈ చిత్రాన్ని ఫాతీమా విజయ్ ఆంటోని, నటి రాధికా శరత్ కుమార్ సంయుక్తంగా విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఆర్ స్టూడియో బ్యానర్‌పై రూపొందించారు.
ఇంద్రసేన, రుద్రసేన (విజయ్ ఆంటోని) ఇద్దరు కవలలు. రంగు, రూపం ఒకేలా ఉంటాయి. తాన ప్రియురాలు ఎలిజబెత్ మరణంతో ఇంద్రసేన తాగుడు బానిస అవుతాడు. రుద్రసేన ఓ పాఠశాలలో వ్యాయామ టీచర్‌ (పీఈటీ)గా పనిచేస్తుంటాడు. అనుకొని పరిస్థితుల్లో ఇంద్రసేన ఓ కేసులో ఇరుక్కొని 7 ఏళ్లు జైలుకు వెళుతాడు. తాను ఇష్టపడిన అమ్మాయి రేవతిని పెళ్లి చేసుకోవాల్సిన రుద్రసేన కిరాయి రౌడీగా మారుతాడు. దాంతో రుద్రసేనకు రేవతి దూరమవుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఇంద్రసేన జైలు నుంచి వచ్చిన తర్వాత ఏం జరిగింది? సౌమ్యుడైన రుద్రసేన ఎందుకు రౌడీగా మారాడు? తన కారణంగానే కుటుంబం పాడైపోయిందనే తల్లిదండ్రుల ఆవేదనకు ఇంద్రసేన ఎలా సాంతన చేకూర్చాడు. రౌడీగా మారిన ఇంద్రసేన చివరకు ఏమైపోయాడు? చివరకు రేవతిని పెళ్లి చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఇంద్రసేన చిత్రం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS