Kaala Movie Public Talk కాలా మూవీ పబ్లిక్ టాక్

Filmibeat Telugu 2018-06-07

Views 1

Rajinikanth starrer Kaala has finally hit the screens today worldwide and fans of the superstar are celebrating the special day in an exciting manner.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'కాలా' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. అభిమానులు ఈ చిత్రం విడుదలతో పండగ మూడ్లోకి వెళ్లిపోయారు. ఇండియాకంటే ముందుగా యూఎస్ఏలో ప్రీమియర్ షోలు ప్రదర్శితం అవ్వడం, పాజిటివ్ టాక్ రావడంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం నెలకొంది. చెన్నైలో తెల్లవారు ఝామున బెనిఫిట్ షోల ప్రదర్శన తర్వాత 'కాలా' సూపర్ హిట్ అని తేలిపోయింది. 'కబాలి' కంటే 'కాలా' మరింత బెటర్‌గా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని యూఎస్ఏలో దాదాపు 300 లొకేషన్లలో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రీమియర్స్ ద్వారా $451,000 వసూలైనట్లు తెలుస్తోంది. యూఎస్ఏలో ఫస్ట్ డే పూర్తయ్యే సమయానికి వసూళ్లు 1 మిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని అంచనా వేస్తున్నారు.
రజనీకాంత్ గత చిత్రాలు పెద్దగా ఆడక పోవడం, ప్రమోషన్లు పెద్దగా నిర్వహించక పోవడంతో ‘కాలా' చిత్రాన్ని చూడటానికి ప్రవాస భారతీయులు పెద్దగా ఆసక్తి చూపలేదని ప్రీమియర్ షోల కలెక్షన్లు చూస్తే స్పష్టమవుతోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS