Raj Kandukuri Latest Movie is Mental Madhilo. All news talent people contributed for Mental Madhilo movie. Sree Vishnu, Nivetha Peturaj are the lead pair. This movie is going good at Box office.
పెళ్లి చూపులు లాంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలకు కొత్తతరం దర్శకులకు ఆహ్వానం పలికిన నిర్మాత రాజ్ కందుకూరి. కొత్త డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా నివేద పెతురాజు హీరొయిన్‌గా మెంటల్ మదిలో చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 24న రిలీజ్ సక్సెస్ దిశగా దూసుకెళ్తున్నది. ఈ సందర్బంగా రామానాయుడు స్టూడియోలో చిన్న సినిమా పెద్ద విజయం'' అనే క్యాప్షన్ పేరుతో ఈ చిత్రం సూపర్ సక్సెస్ మీట్ జరిగింది. ఈ సందర్బంగా నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. నేను ప్రతీ సినిమాలో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూనే వుంటాను. నా దగ్గర పని చేసిన వాళ్ళు ఇంకో సినిమాకి పని చేస్తూ కనిపిస్తే చాలా సంతోషంగా అనిపిస్తుంది. నేను పరిచయం చేసిన వాళ్ళు నా కళ్ల ముందు ఎదుగుతూ ఉంటే ఒకింత గర్వంగా కూడా అనిపిస్తుంటుంది. అలాంటి టాలెంట్ వున్నా కుర్రాళ్ళు ఈ సినిమా ద్వారా ఇండస్త్రిలోకి వచ్చారు. దర్శకుడు వివేక్ ఆత్రేయతోపాటు ఈ సినిమాకి పని చేసిన ప్రతి టెక్నిషియన్స్ భవిష్యత్‌లో గొప్పస్థానంలో వుంటారు. మా ధర్మపత ప్రొడక్షన్స్ ఇలాంటి కొత్త సినిమాలని నిర్మిస్తూనే ఉంటుంది. కొత్త వాళ్ళకు ప్రోత్సాహం అందిస్తూనే ఉంటుంది అని రాజ్ కందుకూరి సంతోషం వ్యక్తం చేశారు.