WhatsApp Stopped Working : Trolled via Posts and Memes

Oneindia Telugu 2017-12-01

Views 196

Like it happened previously, after WhatsApp suffered an outage last night, users took to social media platform -- especially Twitter and started trolling the messaging application about the same via posts and memes.

ఆ మధ్యన సాంకేతిక కారణాల వల్ల కాసేపు పని చేయకుండా పోయిన వాట్సాప్.. తాజాగా ఈ ఉదయం(శుక్రవారం) మరోసారి అటకెక్కింది. మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనదిగా మారిపోయింది వాట్సాప్. ఎవర్ని కదిపినా వాట్సాప్ తెలిసిన వాళ్ళే తప్ప తెలియని వాళ్ళు చాలా అరుదు. ఫోన్ చెక్ చేసే ప్రతిసారీ వాట్సాప్ చెక్ చేయడం అలాగే స్టేటస్ పెట్టడం, వేరే వాళ్ళ స్టేటస్ చూడటం జీవులకు ఇప్పుడో అలవాటుగా మారిపోయింది. అయితే మెసేజింగ్ సర్వీసుల దిగ్గజమైన వాట్సాప్ నిన్న మళ్లీ మొరాయించింది. సాంకేతిక కారణాల వల్ల కాసేపు పని చేయకుండా పోయింది. వాట్సాప్ ను యూజ్ చేసేటప్పుడు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లుగా పలువురు పేర్కొన్నారు. కొన్ని గంటల పాటు సర్వీసు పని చేయనట్లుగా తెలుస్తోంది. అనంతరం సర్వీసులు పునరుద్ధరణ జరిగినట్టు యూజర్లు తెలిపారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల నుంచి వాట్సాప్‌డౌన్‌ అనే ట్వీట్స్ పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. రిపోర్టుల ప్రకారం ఉత్తర యూరప్‌, బ్రెజిల్‌లో ఈ సమస్య ఎక్కువగా ఏర్పడిందని తెలిసింది. ఇండియా మీద తాజా క్రాష్ ప్రభావం లేదన్న మాట వినిపిస్తోంది.

Share This Video


Download

  
Report form