Actor Ramya Krishna's latest movie is Mathangi. This movie trailer launch happend on December 5th at Prasad Labs of Hyderabad. Ramya Krishna, Director Krishna Vamsi, Nandini Reddy are attended for this event. In this program Ramya Krishna, Nandini Reddy speaks about the movie.
రమ్య క్రిష్ణ నటించిన మాతంగి ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ సందర్బంగా నటి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. విభిన్నమైన చిత్రంగా రూపొందించే క్రమంలో ఒక చిన్న ప్రయత్నం ఇది. ఈ సినిమాలో దేవుడు, అమ్మోరు లాంటి అంశాలు ఉంటాయి. చాలా ఆసక్తికరంగా కథా, కథనాలు ఉంటాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 15వ తేదీన విడుదల చేస్తున్నాం అని తెలిపారు. నటీనటులు: రమ్యకృష్ణ, జయరాం, సంపత్, కళాభవన్ మణి, సాంకేతిక వర్గం: నిర్మాత: వినయ్ కృష్ణన్, దర్శకత్వం: కన్నన్ తమ్మరక్కుళ్ళం, సంగీతం: రతేష్ వేగ తదితరులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకురాలు నందినిరెడ్డితోపాటు చిత్ర యూనిట్ పాల్గొన్నది. ఈ సందర్బంగా అలా మొదలైంది, కళ్యాణ వైభోగం చిత్రాల దర్శకురాలు నందినిరెడ్డి మాట్లాడుతూ.. వినయ్ కృష్ణన్ నాకు చెన్నైలోనే పరిచయం. ఆమెకు కథలు అంత త్వరగా నచ్చవు. అలాంటి వినయ్ కృష్ణ నిర్మాతగా మారి రమ్యకృష్ణతో సినిమా చేసారంటే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమా మరో అమ్మోరు చిత్రంలా ఉంటుంది. మరోసారి బాహుబలి సినిమాలో నటనను రమ్యకృష్ణ గుర్తు చేసారు.నటీనటులు: రమ్యకృష్ణ, జయరాం, సంపత్, కళాభవన్ మణి, సాంకేతిక వర్గం: నిర్మాత: వినయ్ కృష్ణన్, దర్శకత్వం: కన్నన్ తమ్మరక్కుళ్ళం, సంగీతం: రతేష్ వేగ తదితరులు