కాస్టింగ్ కౌచ్ పై పోరాటం, ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థనగ్న నిరసనతో ఒక్కసారిగా శ్రీరెడ్డి జాతీయ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారింది. కాస్టింగ్ కౌచ్ పై పోరాటం విషయంలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కూడా శ్రీరెడ్డికి మద్దత్తు తెలిపాయి. ఆ తరువాత శ్రీరెడ్డికి మీడియాలో పబ్లిసిటి బాగా పెరింది. కానీ ఇటీవల శ్రీరెడ్డి విచక్షణ కోల్పోతుందనే వాదన ఎక్కువవుతోంది. తాజాగా చికాగో సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి చేసిన ఘోరమైన తప్పిదం ఆమెని తీవ్ర విమర్శల పాలు చేస్తోంది.
యుఎస్ పోలీసులు ఈ కేసుకు సంబందించిన వివరాలని తెలిపారే తప్పా మరే టాలీవుడ్ సెలెబ్రిటీ పేరు బయట పెట్టలేదు
చికాగో సెక్స్ రాకెట్ గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ శ్రీరెడ్డి ఇటీవల తన సోషల్ మీడియాలో దాదాపు 30 మందికి పైగా టాలీవుడ్ సెలెబ్రిటీల పేర్లు పోస్ట్ చేసింది. శ్రీరెడ్డి చేసిన ఈ చర్య చాలా ఘోరమైన తప్పిదం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇంటివంటి ఆధారాలు లేకుండా, కనీసం సాటి మహిళలే అనే భావన లేకుండా శ్రీరెడ్డి పేర్లు సోషల్ మీడియాలో రాయడం హేయమైన చర్య అని అంటున్నారు.