Rahul Dravid has backed the Virat Kohli-led side to perform well in next year's tour to South Africa, saying that the team was in a really good form at the moment and would surely put up a great show in foreign conditions as well.
దక్షిణాఫ్రికాతో వచ్చే ఏడాది జరగనున్న టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు భారత్‌కు ఇదే గొప్ప అవకాశమని భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అన్నాడు. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరిస్ ముగిసిన అనంతరం కోహ్లీసేన దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జనవరి 5న కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ నేతృత్వంలోని టీమిండియాపై రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికాను ఆ దేశంలో ఓడించే సత్తా భారత జట్టుకు ఉందని తెలిపాడు.
ప్రస్తుత టీమిండియాలో ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు అత్యుత్తమంగా రాణిస్తున్నారని, అదేవిధంగా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశమని రాహుల్ ద్రవిడ్ అన్నాడు. 'ప్రస్తుత జట్టు ప్రకారం దక్షిణాఫ్రికాలో తొలి సిరీస్ విజయానికి ఇది మంచి అవకాశం. మంచి పేసర్లు.. ఆల్‌రౌండర్ (హార్దిక్ పాండ్యా), జడేజా, అశ్విన్‌ల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్నారు' అని అన్నాడు.జట్టులోని ప్రతి బ్యాట్స్‌మన్‌కు దక్షిణాఫ్రికాలో ఆడిన అనుభవం ఉంది. ప్రతి ఒక్కరికీ 40 నుంచి 50 టెస్టులు ఆడారు. కొంచెం అదృష్టం కలిసి వస్తే మాత్రం టీమిండియాకు తిరుగుండదు. అదే గనుక జరిగితే టీమిండియా మరో సిరిస్‌ను తప్పక కైవసం చేసుకుంటుంది' అని ద్రవిడ్ విశ్వాసం వ్యక్తం చేశాడు.