బట్టలూడదీస్తాం! ‘కేటీఆర్ మామ’పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు..!

Oneindia Telugu 2017-12-11

Views 1

Congress leader Revanth Reddy again targets Telangana minister's uncle.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు కొనసాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు ఎస్టీ సర్టిఫికేట్‌తో ప్రభుత్వ ఉద్యోగం పొందారని ఆరోపించారు. ఇలా చేసి ఓ గిరిజనుడి అవకాశాలను కొల్లగొట్టిన హరినాథరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై టీఆర్ఎస్ పెంపుడు నేతలు కాకుండా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించాలని అన్నారు.
ఎస్టీ సర్టిఫికేట్‌తో 35ఏళ్ల ప్రభుత్వ సర్వీసు చేయడంతోపాటు ఇప్పుడు పెన్షన్ కూడా హరినాథరావు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో చర్యలు తీసుకొని సీఎం కేసీఆర్ విశ్వాసం కల్పించాలని కోరారు.
ఈ విషయంలో తాను ఫిర్యాదు చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్టీ పేరుతో కేసీఆర్ వియ్యంకుడు ఉద్యోగాన్ని చేసింది ముమ్మాటికీ నిజమని.. ట్విట్టర్‌లో పలికే కేటీఆర్‌కు తన మామ చేసిన మోసం కనిపించలేదా? అని రేవంత్ నిలదీశారు.
అంతేగాక, తన వియ్యంకుడిని కాపాడాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టులో ప్రభుత్వం బట్టలూడదీస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టబోదని రేవంత్ స్పష్టం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS