పవన్-త్రివిక్రమ్-నితిన్ సినిమాకు వెరైటీ టైటిల్ ! | Filmibeat Telugu

Filmibeat Telugu 2017-12-13

Views 2K

Film nagar source said that, Nitin next Movie Title Confirmed as “Gurthunda Seetakalam”. Krishna Chaitanya is directing this flick, while Megha Akash of Lie fame is playing the female lead.

దర్శకుడిగా మారక ముందు తెలుగు సినిమా పరిశ్రమలో రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఒకప్పుడు తెలుగులో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న రచయిత కూడా. దర్శకుడిగా మారిన తర్వాత వరుస హిట్లతో అతి తక్కువ కాలంలోనే టాప్ పొజిషన్‍‌కు ఎదిగిప త్రివిక్రమ్.... ప్రస్తుతం నిర్మాతగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
పవన్- త్రివిక్రమ్ నిర్మాతలుగా నితిన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూల కథ అందించారు. ఈ మూవీకి వెరైటీ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్ ఫిక్స్ చేశారని తెలిసింది. ఈ టైటిల్ త్రివిక్రమ్ సూచించారని సమాచారం. ఆయన తన గత సినిమాలకు కూడా ఆ..ఆ, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి వెరైటీ టైటిల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ సూచించిన ఈ టైటిల్ ఎంతో క్రియేటివ్‌గా ఉందని అభిమానులు అంటున్నారు.
తొలిసారి పవన్ కళ్యాణ్ తాను కాకుండా తన బ్యానర్ పై మరో హీరో నితిన్ కొసం నిర్మాతగా మారటం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలతో పాటు మూల కధను సమకూర్చటం మరో హైలెట్.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS