పోలవరంపై గడ్కరీ ఏం చెప్పారంటే ? సమావేశం ముగిసాక ఒకే ఒక్క మాట చెప్పిన చంద్రబాబు ! | Oneindia Telugu

Oneindia Telugu 2017-12-14

Views 267

All efforts will be made to complete the Polavaram project in 2018 itself, Union Minister for Water Resources Nitin Gadkari said on Wednesday.

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన సమావేశం అది. ఆ సమావేశం మీదే రాష్ట్ర ప్రయోజనాలు ఆధారపడి ఉన్నాయి. అంతేకాదు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య మైత్రి బంధం కొనసాగింపు ఆధారపడి ఉంది...ఇంకా చెప్పాలంటే అనేక రాజకీయ పరిణామాలకు నాంది కూడా ఆ మీటింగ్ పైనే ఆధారపడి ఉన్నాయి...ఆ సమావేశం...పోలవరంపై కేంద్రమంత్రి గడ్కరీతో ఎపి సిఎం చంద్రబాబు సమావేశం....మరి ఆ సమావేశంలో ఏం జరిగింది....ఆ మీటింగ్ సారాంశం ఏ తేల్చింది. కేంద్రం చంద్రబాబుకు నిజంగానే అనుకూలంగా ఉందా? లేక చెప్పాలి కాబట్టి చెబుతోందా? లేక వ్యతిరేకంగా ఉందా?...ఈ ప్రశ్నలకు జవాబు ఎలా? పోలవరంపై గడ్కరీ ఆదేశాల్లోనే ఈ ప్రశ్నలకు సమాధానం లభిస్తుంది...
పోలవరంను 2018లోపే పూర్తిచేసేందుకు పూర్తి సహకారం..సహాయ, పునరావాస పనులకు 100% వ్యయం కేంద్రమే భరిస్తుంది..కాంక్రీట్‌ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు నెలరోజులు గడువిస్తున్నాం, ఆలోపు అతను లక్ష్యాన్ని చేరుకోకపోతే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్‌ ప్రకారం కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తాం...చంద్రబాబుకి తమ్ముడిలా అండగా నిలుస్తా...అని గడ్కరీ బుధవారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుదీర్ఘ సమావేశం అనంతరం మీడియాతో చెప్పారు. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నాకు సలహాదారుగా ఉంటారు, ప్రతి మూడురోజులకోసారి ఆయన వెళ్లి పనులను చూసి నాకు నివేదిస్తారు. శాఖాపరంగా సమన్వయలోపం ఏదైనా ఉంటే నేరుగా నా దగ్గరకే రమ్మని ఏపీ సాగునీటిశాఖ కార్యదర్శికి చెప్పాను. మా శాఖలో ఏదైనా సమస్య ఉంటే అంతిమ నిర్ణేతగా నేనే నిర్ణయం తీసుకుంటాను. ఈ మాటలతో గడ్కరీ తన నిర్ణయాన్ని కుండబద్దలు కొట్టేశారు. 2011 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం భరించడం మా బాధ్యత అంటూ పెంచిన అంచనా వ్యయాలపై తమ నిర్ణయం ఏమిటో స్పష్టం చేసేశారు గడ్కరీ. తాను సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తినని, ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించనని, అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తిచేసేవారినే ఇష్టపడతానని అన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS