‘సాహో’ మూవీ హీరోయిన్ పై క్రమినల్ కేసు !

Filmibeat Telugu 2017-12-27

Views 545

An Andheri metropolitan court has ordered the Amboli police station to conduct an inquiry against actor Shraddha Kapoor and one of the producers of the Bollywood movie Haseena Parkar on allegations related to cheating and criminal breach of trust.




బాలీవుడ్ హీరోయిన్, ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి 'సాహో' చిత్రంలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ మీద క్రమినల్ కేసు నమోదైంది. ప్రముఖ దుస్తుల డిజైన్ కంపెనీ ఆమెతో పాటు నిర్మాత నహీద్ ఖాన్ మీద ఈ కేసు వేశారు. వాస్తవానికి ఈ కేసులో శ్రద్ధా కపూర్‌ ఉద్దేశ్య పూర్వకంగా చేసింది ఏమీ లేదు, 'హసీనా పార్కర్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించడంతో ఆమె కూడా ఈ కేసులో ఇరుక్కోక తప్పలేదు.
ఈ ఏడాది శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్లో ‘హసీనా పార్కర్' అనే సినిమా వచ్చింది. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ధరించిన దుస్తువులను డిజైన్ చేయడానికి ఓ ప్రముఖ డిజైనర్ ఓ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే దర్శక నిర్మాతలు కాంట్రాక్టును ఉల్లంఘించడంతో వారు కోర్టుకెక్కారు.
ఆ కాంట్రాక్ట్‌ ప్రకారం సినిమాలో ఆ సంస్థ పేరు వేయాలి. సినిమాలో తమ కంపెనీ పేరు ఎక్కడా కనిపించక పోవడంతో సదరు సంస్థ నిర్మాత నహిద్‌ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌పై అంధేరీ మెట్రోపాలిటన్‌ కోర్టులో పిటిషన్‌ వేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై ఎంక్వయిరీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది.



Share This Video


Download

  
Report form
RELATED VIDEOS