హీరోయిన్‌ పై హీరో కేసు !

Filmibeat Telugu 2018-01-11

Views 1.6K

'I Love You' kannada movie actress Radhika Shetty gave complaint against actor Amith in Rajarajeshwari police station Bengaluru.

నటుడు అమిత్ తనను పెళ్లి చేసుకొని మోసగించాడని వర్ధమాన తార రాధికాశెట్టి ఆరోపణలు చేయడం కన్నడ పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే రాధికపై కూడా అమిత్ కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. అమిత్‌పై ఆరోపణలు చేస్తూ ఆమె బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. వీరిద్దరూ ఐ లవ్ యూ అనే కన్నడ చిత్రంలో కలిసి నటించారు.
కన్నడ చిత్రసీమలో తాము ఐ లవ్ యూ సినిమాలో నటిస్తున్న సమయంలో మా మధ్య పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమకు అమిత్ కుటుంబ సభ్యులు అభ్యంతరం చెప్పకపోవడంతో రహస్యంగా పెళ్లి చేసుకొన్నాం.
పెళ్లి తర్వాత ఒకే ఇంట్లో ఉంటూ నాలుగేళ్లు కాపురం చేశాం. నాలుగేళ్లు నన్ను వాడుకొన్న తర్వాత ఇప్పుడు వేరో యువతిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అని తన ఫిర్యాదులో పేర్కొన్నది. అయితే రాధికాశెట్టి ఆరోపణలను అమిత్ ఖండించారు. రాధికాశెట్టిన తాను వివాహం చేసుకోలేదు. ఆమె చేసే ఆరోపణల్లో వాస్తవం లేదు. నాపై అనవసరంగా బురద జల్లుతున్నారు అని అమిత్ పేర్కొన్నారు.
రాధికాశెట్టి తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నది. వేధింపులకు పాల్పడుతున్నది అని రాధిక ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్‌లోనే అమిత్ కేసు నమోదు చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS