జగన్‌కు షాక్ తప్పదా? టీడీపీలోకి వంగవీటి

Oneindia Telugu 2018-01-17

Views 653

It is said that YSRCP MLA Vangaveeti Radha likely to join TDP soon.

విజయవాడ రాజకీయాల్లో మరో రాజకీయ సంచలన పరిణామం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని చెప్పే వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించనున్నారా? అంటే అవుననే వాదన వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం బుధవారం ఉదయం బయటికి రాగా, ఇప్పుడు వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రాధ నోటి నుంచి అధికారికంగా ఏ విషయమూ బయటకు రానప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమని చెబుతుండటం గమనార్హం.
కాగా, వంగవీటి రాధతో చర్చలు పూర్తయ్యాయని కొందరు టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తుండటంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. తనకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు రాధ సిద్ధంగా ఉన్నారని, ఈ విషయమై తమతో చర్చించారని ఆయన ప్రధాన అనుచరులు చెబుతున్నారు.
కాగా, గత కొంతకాలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉంటున్న వంగవీటి రాధ.. పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావిస్తున్నారు. ఈ విషయాన్ని తన అనుచరుల వద్ద చాలాసార్లు ప్రస్తావించినట్లు తెలిసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS