రాముడికి-అల్లాకు మధ్య ఎన్నికల్లో పోటీ

Oneindia Telugu 2018-01-24

Views 2

Karkala BJP MLA Sunil Kumar said that election in the Bantwal constituency will be a competition between Sri Ram and Allah. Kumar made the remarks reacting to comments made by Bantwal MLA and Minister Ramanatha Rai recently crediting his successive elections from the constituency to the grace of Allah and secular credentials of Muslim community there.


కర్ణాటకలో 2018 శాసన సభ ఎన్నికల వేడి అప్పుడే మొదలైయ్యింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా శాసన సభ ఎన్నికల బరిలో అభ్యర్థుల మధ్య పోటీ కాదని, రాముడు- అల్లా మధ్య పోటీ ఉంటుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్లాళ శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ -బీజేపీల మధ్య పోటీ ఉండదని, రాముడు- అల్లా మధ్య పోటీ ఉంటుందని కార్కాళ శాసన సభ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
ఉడిపిలో విలేకరులతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ రాముడు- అల్లా మధ్య శాసన సభ ఎన్నికలు ఉంటాయని తాను ఒక్క సారి కాదు 10 బహిరంగ సభల్లో చెబుతానని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని, ఎవ్వరికీ భయపడే ప్రశ్నేలేదని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన మాటలను సమర్థించుకున్నారు.
తనకు అందరూ కావాలని మంత్రి రామనాథ రై మాట్లాడుంటే తాము ఈ విధంగా మాట్లాడమని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ చెప్పారు. అయితే మంత్రి రామనాథ రై తాను అల్లా కృప, దయతోనే గెలిచానని ప్రసగించారని, అందుకే తాను ఇలా మాట్లాడుతున్నామని బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ క్లారిటీ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS