Karnataka Bandh Latest News and Videos

Oneindia Telugu 2018-01-25

Views 3.5K

Karnataka Bandh: Various pro Kannada activists called state wide bandh on Jan 25th. To demand intervetion of prime minister Narendra Modi in Mahadayi issu, protesters started Karnataka bandh. Here is a story on Bengaluru, how the IT city looks like on Bandh.

కర్ణాటక బంద్ సందర్బంగా నిత్యం వాహనాల రద్దీతో కిటకిటలాడే బెంగళూరు నగరం బోసిపోయింది. గమ్యం చేరుకోవాలంటే గంటల కొద్ది ట్రాఫిక్ లో చిక్కుకునే ప్రజలు గురువారం ఊపిరిపీల్చుకున్నారు. బెంగళూరు నగరంలోని రహదారులు మొత్తం నిర్మాణుషంగా మారిపోయాయి. ప్రయివేటు వాహనాలు సైతం రోడ్ల మీద కనిపించలేదు. చిన్నచితకాగా అక్కడక్కడ కొన్ని ఆటోలు, కార్లు, బైక్ లు దర్శనం ఇచ్చాయి. ట్రాఫిక్ పోలీసులు హాయిగా ఊపిరిపీల్చుకుంటున్నారు.బెంగళూరు నగరంలోకి నిత్యం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే లక్షలాది వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. బంద్ చేస్తున్న వారు ఎక్కడ మా వాహనాల మీద దాడి చేస్తారో అనే భయంతో ప్రజలు వారి సొంత వాహనాలు బయటకు తీసుకురావడానికి వెనకడుగు వేశారు.
బెంగళూరు నగరంలో నిత్యం వాహనాల రద్దీతో గిజగిజలాడే రహదారులు నిర్మాణుషంగా దర్శనం ఇచ్చాయి. నిమిషానికి ఒక్కసారి పడే ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి. గంటల కొద్ది ప్రయాణించే వాహనచోదకులు నిమిషాల వ్యవదిలో గమ్యం చేరుకుంటున్నారు. వేల సంఖ్యలో సంచరించే బీఎంటీసీ బస్సులు (బెంగళూరు సిటీ సర్వీసులు) ఒక్కటి కూడా గురువారం బయటకు రాలేదు. గురువారం ఉదయం అన్ని బస్సులను అధికారులు డిపోలకు తరలించాలని ఆదేశాలు జారీ చెయ్యడంతో మెజస్టిక్ బస్టాండ్ ఖాళీగా దర్శనం ఇచ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS