Prime Minister Narendra Modi arrives at Rajpath for paying homage to Amar Jawan Jyoti at India Gate.
69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. శుక్రవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హోమంత్రి రాజ్ నాథ్ సింగ్, రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర మంత్రులు, భద్రతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు 69వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 'రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, జైహింద్' అని మోడీ ట్వీట్ చేశారు.
రాజ్‌పథ్‌లో ఆర్మీ పరేడ్‌తో పాటు సైనిక బలగాల ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు వేడుకగా నిర్వహిస్తున్నారు. వేడుకల సందర్భంగా ఢిల్లీ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 69వ గణతంత్ర వేడుకలకు 10మంది ఆసియాన్ దేశాల అధినేతలు పాల్గొన్నారు. థాయిలాండ్, వియత్నాం, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, మయన్మార్, లావోస్, కాంబోడియా, బ్రూనై దేశాధినేతలకు మోడీ స్వాగతం పలికారు