Budget 2018 Expectations : ఫిబ్రవరి 1న బడ్జెట్: ఆకాంక్షలు నెరవేరేనా?

Oneindia Telugu 2018-01-30

Views 3

Establish fund to guarantee credit to encourage investment in agriculture sector. Reduce corporate tax rate to 25 per cent from 30 per cent, Enhance tax deductions, exemptions for individuals. Allow full tax deduction for provisioning of non-performing assets at lenders

సామాన్యులు.. కార్పొరేట్లు, స్టాక్ మార్కెట్లు.. వివిధ పారిశ్రామిక రంగాలు ఎదురుచూస్తున్న బడ్జెట్.. అందునా ఎన్నికల ముంగిట మంత్రి అరుణ్ జైట్లీ వచ్చేనెల ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో వివిధ పారిశ్రామిక రంగాలు, ప్రముఖులు, ఆర్థిక వేత్తలు, కార్పొరేట్ సంస్థలు తమకు తాయిలాలు ప్రకటించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. పెట్టుబడుల పెంపునకు మార్గం సుగమం చేయాలని ఇన్వెస్టర్లు కోరుతున్నారు. దేశ ప్రగతికి చుక్కాని అయిన వ్యవసాయంతోపాటు వ్యాపార అభ్యున్నతి కోసం రాయితీలు ప్రకటించాలని ఆశిస్తున్నారు. 2016 నవంబర్ 8వ తేదీన నోట్ల రద్దు, గతేడాది జూలై ఒకటో తేదీన ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వల్ల తలెత్తిన ప్రతికూల ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్రుద్ధిరేటు 6.75శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో జాతి ఆర్థిక, సామాజిక ప్రగతి పరుగులు పెట్టే దిశగా జీడీపీకి పూర్వ వైభవం సాధించే దిశగా విత్త మంత్రి అరుణ్ జైట్లీ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. మరోవైపు ద్రవ్యలోటు లక్ష్యాలు చేరుకోగలమా? అని ఇన్వెస్టర్లు ఆందోళనకు గురవుతున్నారు. అదే జరిగితే లక్ష్యాలను ఛేదించడానికి బాండ్లు విక్రయించే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ల అంచనాలు, ఆకాంక్షలు ఒకసారి పరిశీలిద్దాం..
కార్పొరేట్ సంస్థల పెట్టుబడుల ఆధారంగా లభించే లాభాలపై విధించే కార్పొరేట్ పన్ను 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించాలని కార్పొరేట్లు ఆశిస్తున్నారు. దీంతోపాటు కనీస ప్రత్యామ్నాయ పన్నును 18.5 నుంచి 15 శాతానికి తగ్గించాలని మరో అభ్యర్థన. టాక్స్ డిడక్షన్లు విస్తరించి.. వ్యక్తిగత ఆదాయ మినహాయింపులు పెంచాలన్నది ఇంకొక అభ్యర్థన. వ్యవసాయ రంగంలో ప్రోత్సాహం కోసం రుణ పరపతికి హామీ కోసం ఫండ్ ఏర్పాటు చేయాలి. పంటల బీమా పథకాల కోసం అధిక నిధులు కేటాయించాలి. సూక్ష్మ సాగునీటి పరిశ్రమల నిర్మాణంతోపాటు రిజర్వాయర్లు, కాలువల నిర్మాణానికి నిధుల పెంపు. వ్యర్థాల నివారణకు కోల్డ్ స్టోరేజీ ప్లాంట్ల నిర్మాణానికి సబ్సిడీల కొనసాగింపు. రసాయన ఎరువులపై సబ్సిడీలు తగ్గించాలి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS