Telangana finance minister Etela Rajender presents budget for 2018-19. Rs 5,800 crore have been allocated to the Police department. Rs 75 crore allocated for journalists welfare and Rs 100 crore for advocates welfare.
బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. మహిళా, శిశువుల సంక్షేమం కోసం రూ.1799 కోట్లను కేటాయించింది. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఎంబీసీ సంక్షేమం కోసం వెయ్యి కోట్లను కేటాయించారు. రజక ఫెడరేషన్ కోసం బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయించారు. మైనార్టీ శాఖకు రూ. 2 వేల కోట్లు, గర్భిణీల సంక్షేమం కోసం రూ. 561 కోట్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
నాయీబ్రహ్మణ ఫెడరేషన్‌కు రూ. 250 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం రూ.2643 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలకు రూ. . 1450 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్టెట్‌లో రూ. 75 కోట్లు కేటాయించారు. ఎస్సీల సంక్షేమం కోసం రూ. 12,709 కోట్లు, ఎష్టీల సంక్షేమం కోసం రూ.8063 కోట్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. బీసీల సంక్షేమం కోసం రూ.5920 కోట్లు కేటాయించింది. దళితులకు మూడెకరాలను భూ పంపిణీకి సుమారు రూ.1469 కోట్లను కేటాయించింది. నాయీ బ్రహ్మణ ఫెడరేషన్‌కు రూ. 250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ముస్లిం అనాధ పిల్లలకు ఆశ్రయం ఇచ్చే కుల్ గుర్బా భవన్ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను బడ్జెట్‌లో కేటాయించింది సర్కార్.
ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈటెల బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడేలా ఉందని అన్నారు.
అన్ని రంగాలను సమతూలన చేస్తూ బడ్జెట్ ప్రతిపాదించారని కేసీఆర్ అభినందించారు. ఆదాయ వనరులను పూర్తి సమతౌల్యంతో బడ్జెట్ రూపొందించారని అన్నారు.
ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో బడుగు, బలహీన వర్గాలకు తగిన ప్రాధాన్యత లభించిందని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందరికీ అందించేలా బడ్జెట్ ఉందని అన్నారు. పోలీసు వ్యవస్థకు 5వేల కోట్లు కేటాయించి, ప్రజల భద్రతపై ప్రభుత్వం చిత్తశుద్ధి చాటుకుందని అన్నారు. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు తగిన ప్రాధాన్యత లభించిందన్నారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఏర్పడిందని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ప్రజలకు పూర్తిగా న్యాయం చేసేలా బడ్జెట్ ఉందని తెలిపారు.