YCRCP Jagan told the approach of Chandrababu Naidu reminds him of a short story.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 81వ రోజుకి చేరుకుంది. మంగళవారం ఉదయం ఆయన అన్నారెడ్డిపాలెం క్రాస్ రోడ్డు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. సాయంత్రం బుచ్చిరెడ్డిపాళెంలో బహిరంగ సభ సందర్భంగా వీధులన్నీ జనసంద్రంగా మారాయి. జిల్లాకు చెందిన పలు అంశాలపై జననేత ప్రస్తావించి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఎండగట్టారు.