The late veteran Director K Balachander's Office and House have been let for auction by the UCO Bank . It is heard that a debt of Rs. 1 crore and 36 lakhs had been due on his properties.
ఎంతో మందికి సినీరంగంలో జీవితాన్ని ప్రసాధించి స్టార్లుగా తీర్చిదిద్ది సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు కె. బాలచందర్ ఆస్తులు వేలం వేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వనటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ ను సినీరంగానికి పరిచయం చేసిన కె. బాలచందర్ కుటుంభానికి ఇలాంటి కష్టం వస్తోందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలు గురువు ఆస్తుల విషయంలో ఏం చేస్తారు ? అనే చర్చ మొదలైయ్యింది.
శివాజీరావ్ గైక్వాడ్ పేరుకు బదులు రజనీకాంత్ అనే నామకరణం చేసిన కె. బాలచందర్ తన సినిమాలో రజనీకాంత్ కు మొదటి అవకాశం ఇచ్చారు. బాలచందర్ శిష్యుడిగా రజనీకాంత్ తన కంటూ ఓ ప్రత్యేకత చాటుకున్నారు. బాలచందర్ సూచనలతో రజనీకాంత్ ఈరోజు సూపర్ స్టార్ అయ్యారు. కె. బాలచందర్ హీరో కమల్ హాసన్ ను విశ్వనటుడిగా తయారు చేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కమల్ హాసన్. రజనీకాంత్ ఇద్దరూ కె. బాలచందర్ శిష్యులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాలచందర్ దర్శకత్వం వహించిన సినిమాలు దాదాపుగా అన్ని బాషల్లో సూపర్ హిట్ అయ్యాయి.
కె. బాలచందర్ కు చెన్నైలో సొంత ఇల్లు, కార్యాలయం ఉంది. బాలచందర్ చివరి రోజుల్లో అనారోగ్యంతో అప్పులపాలైనారు.
అనారోగ్యంతో బాదపడుతున్న కె. బాలచందర్ తన ఇల్లు, కార్యాలయం డాక్యూమెంట్లు చెన్నైలోని యూకో బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారు. కె. బాలచందర్ ఆనారోగ్యంతో మరణించడంతో బ్యాంకులోని రుణం, వడ్డి పేరకుపోయింది.
రుణం తీసుకుని చెల్లించని వారి పేర్లు, ఆస్తుల వివరాలను యూకో బ్యాంకు దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది. అందులో కె. బాలచందర్ పేరు, ఆస్తుల వివరాలు ఉన్నాయి. కె. బాలచందర్ తీసున్న రుణం చెల్లించలేదని, రూ. 1.36 కోట్లకు ఆయన ఇల్లు, కార్యాలయం వేలం వేస్తున్నామని యూకో బ్యాంక్ ఆదివారం దినపత్రికల్లో ప్రకటన ఇచ్చింది.