Auspicious Wedding Dates From Feb 24, Huge Rush in Telugu States

Oneindia Telugu 2018-02-14

Views 12

Both telugu states are witnessing a huge rush of couples trying the nupital knot during the 3-day auspicious period starting from February 24. Maghamasam is an auspicious month for marriages, according to Telugu Panchamgam.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పెళ్లి సందడి మొదలవనుంది. సంబంధాలు కుదుర్చుకుని మంచి ముహూర్తాలు లేక పెళ్లిళ్లు చేసుకోలేకపోయిన వేలాది మంది వధూవరులు ఇక వేదమంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటవనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా బాజాభజంత్రీల సందడే లేదు. మాఘ మాసం వచ్చినా.. నవంబరు నెలాఖరునుంచే మూఢం ప్రారంభం కావడం ఇందుకు కారణం. ఫిబ్రవరి 19 నుంచి మూఢం వీడనుంది.. దీంతో మళ్లీ బాజాభజంత్రీలు మోగనున్నాయి.
2017 అక్టోబరు నెల తరువాత పెద్దగా పెళ్లిళ్లు జరగలేదు. వరుసగా గురు, శుక్రమౌఢ్యాల రావడమే ఇందుకు కారణం. మధ్యలో రెండు మూడు మినహా మంచి ముహూర్తాలే లేకుండా పోయాయి. శుక్రమౌఢ్యమి కూడా ఈనెల 19తో ముగుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిసందడి మొదలుకానుంది. ఫిబ్రవరి చివరి వారం నుంచి మే 13 వరకు శుభ ముహూర్తాలు ఉండడతో రెండు రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి.
నిజానికి వివాహాలకు శ్రేష్టమైనది మాఘమాసం. విదేశాల్లో ఉండే వారికి డిసెంబరు నెలలోనే ఎక్కువ సెలవులు ఉంటాయి కాబట్టి సహజంగా ఈ నెలలోనే అధిక సంఖ్యలో వివాహాలు జరుగుతాయి. కానీ గత ఏడాది నవంబరు నెల చివరి నుంచే శుక్రమౌఢ్యమి ప్రారంభం కావడంతో మాఘమాసం వచ్చినా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా పెళ్లి బాజాలు మోగలేదు.
ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపు లక్షా 35 వేలకుపైగా వివాహాలు జరుగుతాయని అంచనా. ఒక్క హైదరాబాద్‌లోనే 75 వేలకుపైగా పెళ్లిళ్లు జరగనున్నాయని, ఇక మిగిలిన 9 జిల్లాల్లో జస్ట్ 10 రోజుల్లోనే దాదాపు 60 వేలకుపైగా వివాహాలు జరుగబోతున్నాయట.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS