త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా కి అపవాదు పోయిందా ?

Filmibeat Telugu 2018-02-15

Views 358

NTR and Trivikram movie will be a hit If sentiment will workout.. . NTR previous movies hits and flops look like that. NTR-Trivikram In the past, there was a rumour that Junior NTR only falls behind the flop directors.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోయే సినిమాకు అంతా సిద్ధం అవుతోంది. ఈ కలయికలో వస్తున్న తొలి చిత్రం ఇది. మాటలతోనే మాయ చేసే త్రివిక్రమ్, ఎలాంటి పాత్ర అయినా పిండి చేసే ఎన్టీఆర్.. వీళ్ళిద్దరూ కలిస్తే ఎలాంటి ఉంటుందనే ఊహాగానాలలో ఎన్టీఆర్ అభిమానులు తేలిపోతున్నారు. కానీ అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ చేస్తున్న చిత్రం కావడంతో కొందరు ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళనకు గురి అవుతున్నారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఎన్టీఆర్ గత చిత్రాల సెంటిమెంట్ చెబుతోంది. ఆ లెక్కన ఈ సినిమా హిట్టు ఖాయం.
ఎన్టీఆర్ సక్సెస్ దర్శకుల వెంట పడుతాడనే అపవాదు అప్పట్లో బలంగా వినిపించేది. కిక్ చిత్రం తరువాత సురేందర్ రెడ్డి, కందిరీగ చిత్రం తరువాత సంతోష్ శ్రీనివాస్, దూకుడు తరువాత శ్రీనువైట్లతో ఇలా విజయాలు ఉన్న దర్శకులని మాత్రం ఎన్టీఆర్ దగ్గరకు చేరనిస్తాడని ఆ మధ్యన ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. క్రమంగా ఆ అపవాదు తొలగిపోయింది. ఎన్టీఆర్ చేస్తున్న తాజా చిత్రాలే అందుకు నిదర్శనం.
ఎన్టీఆర్ ఇప్పుడు డైరెక్టర్లని నమ్మడం లేదు.. కథలనే నమ్ముకుని ముందుకు వెళుతున్నాడు. అందుకే విజయాలు సొంతం అవుతున్నాయి. కథ నచ్చితే అట్టర్ ప్లాప్ డైరెక్టర్ తో అయినా సినిమా చేయడానికి వెనుకాడడం లేదు
1 నేనొక్కడినే వంటి డిజాస్టర్ చిత్రం తరువాత ఎన్టీఆర్ సుకుమార్ కు ఒకే చెప్పడం విశేషం. సుకుమార్ చెప్పిన కథ నచ్చడంతో ప్లాప్ లో ఉన్న సరే చేయటానికి వెనుకాడలేదు. సుకుమార్ తెరకెక్కించిన నాన్నకు ప్రేమతో చిత్రం మంచి విజయం సాధించింది.
పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ తో టెంపర్ చిత్రం చేసే ముందు వరకు ఈ దర్శకుడు నిఖార్సైన హిట్టు కొట్టి చాలా కాలం అయింది. కానీ వీరి కాంబినేషన్ లో వచ్చిన టెంపర్ చిత్రం సూపర్ హిట్ కావడం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS