PNB Fraud : Nirav Modi Flees India, Who Is He ?

Oneindia Telugu 2018-02-15

Views 18

Priyanka Chopra, who was appointed as the global ambassador by luxury diamond jeweller Nirav Modi, has dragged the diamantaire to court for non-payment of dues. And The key person in Punjab National bank (PNB) scam fled from India to Switzerland before FIR was filed.

లగ్జరీ డైమండ్ జ్యువెల్లర్ నీరవ్ మోడీ చేస్తున్న వ్యాపారాలకు గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక చోప్రా నియామకం అయిన సంగతి తెలిసిందే. అయితే నీరవ్ మోడీకి ప్రియాంక చోప్రా తాజాగా లీగల్ నోటీసులు పంపింది. యాడ్స్ చేసినందుకు తనకు రావాల్సిన డబ్బు ఇంకా చెల్లించక పోవడంతో ప్రియాంక చోప్రా ఈ నోటీసులు జారీ చేశారు.
నీరవ్ మోడీ ఇండియాలోని ప్రముఖ వజ్రాల వ్యాపారి. ప్రియాంక చోప్రా, సిద్ధార్థ్ మల్హోత్రా, లీసా హెడెన్ లాంటి వారితో తమ ఆభరణాలకు ప్రచారం చేయించారు. హాలీవుడ్ స్టార్స్ కేట్ విన్స్‌లెట్, డకోటా జాన్సన్‌తో కూడా ఇతగాడి బ్రాండ్ ప్రమోషన్లలో పాల్గొన్నారు. నీరవ్ మోడీ 2.3 బిలియన్ డాలర్లతో ఫైర్ స్టార్ డైమండ్ అనే సంస్థను స్థాపించాడు. వజ్రాల వ్యాపారుల కుటుంభంలోనే ఆయన పుట్టాడు. వజ్రాల వ్యాపారాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. ఆసియాలోని చైనా నుంచి ఉత్తర అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాల్లో తన వ్యాపారాలను విస్తరించాడు.
ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో నీరవ్ మోడీ తొలిసారి 2013లో చోటు దక్కించుకున్నాడు. 2016 ఫోర్బ్స్ జాబితాలో ప్రపంచంలో ఆయనకు 1,067 ర్యాంక్ దక్కింది. భారత్‌ బిలియనీర్లలో ఆయనకు 46వ స్థానం దక్కింది. నిరుడు భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో 82వ ర్యాంక్ పొందాడు. 2017లో ఆయన భారత్‌లో 57వ స్థానం దక్కించుకున్నారు.
గత పది రోజుల వరకు నీరవ్ మోడీపై ఎవరి దృష్టీ పడలేదు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సిబిఐకి ఫిర్యాదు చేయడంతో ఆయన పేరు వెలుగులోకి వచ్చింది. నీరవ్ మోడీ శక్తివంతమైన వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, వజ్రాల కొనుగోలు దారు. బ్యాంకును దాదాపు దాదాపు రూ.280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణతో నీరవ్ మోడీపై ఫిబ్రవరి 5వ తేదీన సిబిఐ కేసు నమోదు చేసింది.

Share This Video


Download

  
Report form