The CBI has arrested key accused Gokulnath Shetty then Dy Manager (now Retd) Punjab National Bank, Manoj Kharat, SWO(single window operator) and Hemant Bhat, Authorised Signatory of the Nirav Modi Group of Firms in connection with about Rs 11,400 crore scam. They will be produced before CBI special court Mumbai on Saturday.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై శివసేన తీవ్ర స్థాయిలో స్పందించింది. ఈ స్కాం సూత్రధారి నిరవ్ మోడీ బీజేపీలో భాగమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మోసపూరితంగా రూ. రూ.280 కోట్లు లావాదేవీలు జరిపారంటూ ప్రముఖ జ్యూయలరీ డిజైనర్ నీరవ్ మోడీపై ఫిబ్రవరి 5న సీబీఐ వద్ద కేసు నమోదైన సంగతి తెలిసిందే.
అయితే ఆయన మొత్తం రూ.11 వేల కోట్లకు పైగా మోసం చేసినట్టు గుర్తించామంటూ ఈనెల 14న పంజాబ్ నేషనల్ బ్యాంకు వెల్లడించింది. ముంబైలో ఛాగన్ భుజ్‌బల్, పాట్నాలో లాలూ ప్రసాద్ యాదవ్‌లు కుంభకోణాలకు పాల్పడి జైళ్లలో మగ్గుతుంటే... లిక్కర్ డాన్ విజయ్ మాల్యా, నీరవ్ మోడీలాంటి వాళ్లు మాత్రం బ్యాంకులకు కోట్లాది రూపాయలు ఎగవేసి విదేశాలకు పారిపోయారంటూ శివసేన ధ్వజమెత్తింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు ద్వారా 150 నకిలీ లెటర్స్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇప్పించుకుని వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, ఆయన మేనమామ తదితరులు దాదాపు రూ. 11,300 కోట్ల మేర మోసగించిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం బయటపడుతున్న తరుణంలోనే.. నెలరోజుల ముందే నీరవ్ మోడీ, ఆయన కుటుంబ సభ్యులు విదేశాలకు చెక్కేశారు. వీరిని పట్టుకునేందుకు సీబీఐ ఇంటర్‌పోల్ సాయం కోరడంతో... ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ఇదే కేసులో ఆదాయ పన్ను శాఖ సైతం పన్ను ఎగవేతలపై విచారణ ముమ్మరం చేసింది. నీరవ్ మోడీ ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 105 బ్యాంకు ఖాతాలు, 29 ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. మరోవైపు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రప్రభుత్వం ఇప్పటికే నీరవ్ మోడీ పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది
దేశ బ్యాంకింగ్ రంగంలోనే సంచలనమారిన పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) రూ.11వేల కోట్ల కుంభకోణానికి సంబంధించిన కీలకమైన వ్యక్తిని శనివారం సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. చోక్సీకి చెందిన గీతాంజలి సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు శుక్ర, శనివారాల్లో వరుసగా దాడులు చేపట్టారు. ఇప్పటికే చోక్సీ, నీరవ్ మోడీ పాస్‌పోర్టులను విదేశాంగ శాఖ తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ కేసు వెలుగులోకి రాక ముందే వీరిద్దరూ విదేశాలకు చెక్కేశారు.