Virat Kohli Achieves Rare Double In ICC Rankings

Oneindia Telugu 2018-02-21

Views 122

Kohli made 558 runs in the recent six match series against South Africa. The run-feast saw his ODI ranking climb to 909 points, making him the 12th player in history to reach the 900-point mark.

గత కొన్నేళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేస్తోన్న టీమిండియా విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ (909) అత్యధిక బ్యాటింగ్ రేటింగ్ పాయింట్లను సొంతం చేసుకున్నాడు. దీంతో 27 ఏళ్ల తర్వాత మళ్లీ వన్డేల్లో 900పైచిలుకు పాయింట్లు అందుకున్న ఏకైక క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. అంతేకాదు వన్డేల్లో, టెస్టుల్లో 900కు పైగా రేటింగ్‌ పాయింట్ల సాధించిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఈ జాబితాలో 1991లో చివరిసారిగా ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డీన్ జోన్స్ 918 పాయింట్లతో మెరిశాడు. ఆ తర్వాత.. ఎవరూ వన్డేల్లో ఆ స్థాయి ప్రదర్శనని చేయలేకపోయారు. అంతేకాదు క్రికెట్‌ చరిత్రలో ఒకేసారి వన్డేల్లో, టెస్టుల్లో 900కు పైగా పాయింట్లు సాధించిన రెండో క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో విరాట్ కోహ్లీ మూడు ఫార్మాట్లలో టాప్-3 స్ధానాల్లో నిలిచాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో కోహ్లీ అగ్రస్థానం ఉండగా, టెస్టు ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం... టీ20ల్లో మూడో స్థానంలో నిలిచాడు.
టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ 947 పాయింట్లతో ఉండగా, కోహ్లీ 912 పాయింట్లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20ల్లో 786 పాయింట్లతో బాబర్ అజామ్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆరోన్ ఫించ్ (784), విరాట్ కోహ్లీ (776) పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. 1991లో ఆస్ట్రేలియా డీన్ జోన్స్ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకుల్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకముందు వివ్ రిచర్డ్స్ (1985లో 935 రేటింగ్ పాయింట్లు), జహీర్ అబ్బాస్ (1983లో 931), గ్రెగ్ చాఫెల్ (1981లో 921), డేవిడ్ గోవర్ (1983లో 919), జావెద్ మియాందాద్ (1987లో 910) ఈ జాబితాలో ఉన్నారు.

Share This Video


Download

  
Report form