Sridevi, Boney Kapoor, Mithun Chakraborty Controversial Affair

Filmibeat Telugu 2018-02-26

Views 19

Boney's marriage and eventually marrying him, causing Arjun Kapoor to have a rather troubled childhood, most people have forgotten about her marriage to Mithun Chakraborty who was actually already married to Yogeeta.

శ్రీదేవి జీవితంలో ఘనమైన కీర్తి మాత్రమే కాకుండా ఆమె లైఫ్‌లో అనేక వివాదాలు ఉన్నాయి. శ్రీదేవీ జీవితంలోని అత్యంత వివాదాస్పద అంశం బోనికపూర్‌తో పెళ్లి. శ్రీదేవి వివాహం అప్పట్లో బాలీవుడ్‌ను కుదిపేసింది. బోనికపూర్ మొదటి భార్య మోనా కపూర్ వివాహం తర్వాత శ్రీదేవిపై నిప్పులు చెరిగింది. శ్రీదేవి జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలు.
80 దశకంలో బాలీవుడ్‌లో మిథున్ చక్రవర్తి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నాడు. డిస్కో డాన్సర్, డ్యాన్స్ డ్యాన్స్ చిత్రాలతో మిథన్ చెలరేగిపోతున్నాడు. అలాంటి సమయంలో మిథున్‌తో శ్రీదేవీ పరిచయం ప్రేమగా మారింది. 1985లో మిథున్‌, శ్రీదేవి పెళ్లి చేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మూడేళ్లు కాపురం చేసిన తర్వాత 1988లో విడిపోయారనేది సినీ వర్గాల సమాచారం. పలువురు శ్రీదేవి, మిథన్ పెళ్లి వార్తను కూడా ధృవీకరించారు.
శ్రీదేవి వ్యవహారం మిథున్, బోనికపూర్ మధ్య చిచ్చు రేపాయి. శ్రీదేవి అంటే బోనికి ఇష్టం పెరుగడం మిథున్‌కు సహించలేదు. బోనికి శ్రీదేవి రాఖీ కట్టడంతో మిథున్ ప్రేమకు బీటలు వారింది. బోనికి చేరువ కావడం వల్లనే మిథున్‌‌కు దూరమై వారి పెళ్లి అర్థాంతరంగా ముగిసిందని చెప్పుకొంటారు.
ఇక శ్రీదేవితో పెళ్లి జరిగిందనే వార్త బయటకు పోక్కగానే మిథున్ భార్య యోగితా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందనే వార్తలు వచ్చాయి. శ్రీదేవిని మిథున్ పెళ్లి చేసుకోవడం నాకు అభ్యంతరం లేదు. కానీ శ్రీదేవి మిథున్‌కు రెండో భార్యగా ఉంటుందనే షరతుపై ఒప్పుకొంటాను అని యోగితా చెప్పింది.

Share This Video


Download

  
Report form