కేంద్రం పై సిబిఐ విచారణ జరపాలని చంద్రబాబు డిమాండ్ !

Oneindia Telugu 2018-03-23

Views 550

AP CM Chandrababu Naidu over BJP in his speech at Legislative Assembly on thursday. While targeting the Centre, he said that he did not fear CBI action and added that he is ready to take on the government. He further claimed that CAG report has found the Centre's fault on several issues and also questioned whether the central government is ready for the CBI inquiry.

కాగ్‌ మామీదే కాదు మీ మీద కూడా నివేదికలిచ్చింది కదా...మరి మీరూ సిబిఐతో విచారణ చేయించుకుంటారా?...అంటూ సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. పట్టిసీమ పథకంపై నిధుల దుర్వినియోగం గురించి కాగ్‌ నివేదిక ఆధారంగా అసెంబ్లీలో బిజెపి సభ్యులు చేసిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని సిఎం కేంద్రంపై ఈ ప్రశ్నసంధించినట్లు తెలుస్తోంది. ప్రపంచ జలదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని సిఎం గురువారం శాసనసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా సిఎం చంద్రబాబు మాట్లాడుతూ దేశంలో అవినీతిని నిర్మూలిస్తామన్న ప్రధాని, తన కార్యాలయంలో ఎ1, ఎ2లను పక్కన పెట్టుకుని రాష్ట్రంపై కుట్రకు పాల్పడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ఎన్నికల సమయంలో...కేంద్రంలో అధికారం చేపట్టిన తొలినాళ్లలో...నాడు ఏం చెప్పారు, రాష్ట్రానికి ఇంతవరకు ఏమిచ్చారో చెప్పాలని బిజెపిని డిమాండ్‌ చేశారు. అన్నిరాష్ట్రాలకు రెగ్యులర్‌గా వచ్చే నిధులే రాష్ట్రానికి వచ్చాయన్నారు. రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పమని తాను డిమాండ్‌ చేస్తే తన పైనే ఎదురు దాడి చేస్తున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా ఎవ్వరికీ ఇవ్వడం లేదని తనతో అబద్దం చెప్పారన్నారు. టిడిపి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి రాజకీయ పార్టీలన్నీ మద్దతు తెలిపినా ఎందుకు చర్చకు రానివ్వడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అభివృద్ధికి సహకరించమంటుంటే సిబిఐ విచారణలంటున్నారని, అన్నింటిపైనా సిబిఐతో విచారణ చేయిస్తారా... ఇవెక్కడి రాజకీయాలంటూ చంద్రబాబు విస్మయం వ్యక్తం చేశారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS