Dhoni has caught attention after displaying his skills in a different ball game. CSK captain was seen relaxing while playing a game of pool.
పరిచయం అక్కర్లేని పేరు... టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. భారత్‌కు రెండు వరల్డ్ కప్‌లు అందించిన ఏకైక కెప్టెన్. అలాంటి ధోనికి క్రికెట్‌లోనే కాదు ఇతర క్రీడల్లో కూడా ప్రావీణ్యం ఉంది. తాజాగా ధోని బిలియర్డ్స్ ఆడుతున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.
ఏ బాల్ అయితే ఏంటి? ఏదైనా ఆటే కదా' అని క్యాప్షన్ ఇస్తూ 'తలా', 'విజిల్ పోడు' లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌ను జత చేస్తూ ట్వీట్ చేసింది. ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న ధోని ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ కోసం సన్నద్ధం అవుతున్నాడు. రెండేళ్ల నిషేధం తర్వాత ఐపీఎల్ 2018 సీజన్‌లోకి అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని కెప్టెన్‌గా వ్యవహారిస్తోన్న సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2018 సీజన్ ఏప్రిల్ 7న అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పూర్తి చేసింది. ఆడిన ఎనిమిది ఐపీఎల్ సీజన్లలో కూడా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన జట్లలో చెన్నై జట్టు ఒకటి.
ఇండియన్ ప్రీనియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నీలో చెన్నై జట్టు ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిచింది.