Sonam Kapoor Wedding In Geneva, Dates Out

Filmibeat Telugu 2018-03-24

Views 1.2K

Sonam Kapoor's wedding details are out! The 32-year-old actress who has been dating businessman Anand Ahuja for over two years will tie the knot over a two-day ceremony on May 11 and 12 in Geneva.

శ్రీదేవి మరణంతో విషాదంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు ఆ బాధ నుండి ఇప్పుడిప్పుడే బయట పడుతున్నారు. త్వరలో ఈ విషాదాన్ని పూర్తిగా మరిచిపోయి వేడుకలో మునగబోతోన్నారు. హీరోయిన్ సోనమ్ కపూర్ పెళ్లి డేట్ ఫిక్స్ అయింది.
బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కొన్ని రోజులుగా తన బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహుజాతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి పెళ్లి డేట్, వెన్యూ ఫిక్స్ అయింది. మే 11, 12 తేదీల్లో జెనీవాలో వీరి వివాహం జరుగబోతోందని తెలుస్తోంది.
పెళ్లి వేడుక సందర్భంగా అతిథులందరినీ జెనీవా తీసుకెళ్లాలి కాబట్టి భారీ ఎత్తున ఫ్లైట్ బుకింగ్స్ చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. సోనమ్ కపూర్ తండ్రి అనిల్ కపూర్ గెస్టులకు స్వయంగా ఫోన్లు చేస్తూ తన కూతురి పెళ్లికి ఇన్వైట్ చేస్తున్నారట.
సంగీత్, మెహందీ లాంటి కార్యక్రమాలతో ట్రెడిషనల్ హిందూ వెడ్డింగ్‌లా ఈ పెళ్లి వేడుక జరుగబోతోంది. అయితే పెళ్లి వేడుక ముందే కేవలం కుటుంబ సభ్యుల మధ్య ఎంగేజ్మెంట్ వేడుక జరుగనుందట. అయితే వెన్యూ ఎక్కడ అనే విషయం ఇంకా బయటకు రాలేదు.
అయితే జెనీవాలో పెళ్లి ఎందుకు? అని చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. అందుకు గల కారణాలు పరిశీలిస్తే.... సోనమ్ కపూర్ స్విస్ లగ్జరీ వాచ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. ఇటీవలే ఈ కంపెనీ జెనీవాలో కూడా ఏర్పాటయింది. ఈ కారణంతోనే ఆమె తన పెళ్లి అక్కడ ప్లాన్ చేసుకున్నట్లు భావిస్తున్నారు.

Share This Video


Download

  
Report form