YSRCP Leader Peddireddy Ramachandra Reddy alleged that CM Chandrababu came to delhi for his political lobbying. He alleged Babu is fearing about corruption allegations against him
ఏపీ సీఎం ఢిల్లీ పర్యటనపై అనేక సందేహాలు ఉన్నాయని వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు ఢిల్లీ వస్తున్నది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదని, తనపై ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలోనే హస్తినకు వస్తున్నారని ఆరోపించారు.
పోలవరం ప్రాజెక్టు అవినీతి, మంత్రి లోకేష్‌పై మనీ లాండరింగ్ ఆరోపణలు చంద్రబాబును భయపెడుతున్నాయని పెద్దిరెడ్డి అన్నారు. తనను, తన కుటుంబాన్ని కేసుల నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీలో లాబీయింగ్ చేయడం కోసమే ఆయన వచ్చారని పేర్కొన్నారు.
పార్లమెంటు మరో మూడు రోజుల్లో నిరవధికంగా వాయిదా పడుతుంటే..చంద్రబాబుకు ఇప్పుడు ఢిల్లీ గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు.టీడీపీ ఎంపీలకు ప్రత్యేక హోదా కోసం ఏ మేరకు దిశా చేశారని ప్రశ్నించారు. హోదా విషయంలో వైసీపీ ఎంపీలు రాజీనామాలకే కాదు,ఆ వెంటనే ఆమరణ దీక్షలకు కూడా దిగుతారని గుర్తుచేశారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు వైసీపీ అన్నివిధాలా ప్రయత్నిస్తోందని,మరి టీడీపీ ఏం చేస్తుందో చెప్పాలని నిలదీశారు. ఢిల్లీలో చంద్రబాబు దేనికోసం లాబీయింగ్ చేస్తున్నారో.. అసలు ఇప్పటిదాకా ఎంపీల కార్యాచరణను ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.