IPL 2018: Sunrisers Hyderabad vs Rajasthan Royals Match Preview

Oneindia Telugu 2018-04-09

Views 140

Sunrisers Hyderabad and Rajasthan Royals will have to overcome the unexpected loss of their respective captains, David Warner and Steve Smith, when the two teams clash in an Indian Premier League (IPL) match, here on Monday (April 9). Royals, back in the tournament after serving a two-year suspension, and Sunrisers, lost their influential players after BCCI barred them from the league following their role in the ball-tampering scandal in South Africa. Ajinkya Rahane will be leading Royals in Smith's absence while New Zealand skipper Kane Williamson will captain the Hyderabad franchise.

కొద్ది రోజుల క్రితం జరిగిన బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా జట్టుతో పాటు ఐపీఎల్‌ను సైతం గాబరా పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఐపీఎల్‌లో కెప్టెన్లు వ్యవహరిస్తారనుకున్న డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ పూర్తి టోర్నీకే దూరమైయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త కెప్టెన్లతో ఐపీఎల్ ఆడేందుకు ఇరుజట్లు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సిద్ధమవుతున్నాయి.
రాజస్థాన్‌కు స్మిత్‌ , హైదరాబాద్‌కు వార్నర్‌ లేని లోటును కొత్త కెప్టెన్లు అధిగమిస్తారా.. లేదా అనేది సందిగ్ధం. హైదరాబాద్ జట్టుకు మాత్రం విలియమ్సన్ న్యాయం చేయగలడంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాజస్థాన్ పగ్గాలు రహానె అప్పగించింది ఆ జట్టు యాజమాన్యం.
ఒకప్పుడు సన్‌రైజర్స్‌ అనగానే వార్నర్‌ గుర్తొచ్చే వాడు. అతని కుటుంబంతో సహా స్టేడియంలో హాజరై సందడి చేసేవారు. జట్టుపై అలాంటిది వార్నర్‌ ముద్ర ఇప్పుడు ఉండదు. అతని గైర్హాజరీలో నాయకత్వ బాధ్యతలు విలియమ్సన్‌ చూసుకోనున్నాడు.
కొన్ని సీజన్‌లుగా వార్నర్‌ తర్వాత జట్టు బ్యాటింగ్‌లో క్రియాశీల పాత్ర ధావన్‌దే. వార్నర్‌ తర్వాత అత్యధిక పరుగులు అతనివే. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌లో ధావన్‌ బాధ్యత మరింత పెరగనుంది.
ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ బలం.. బౌలింగే. పదునైన పేసర్లు.. నాణ్యమైన స్పిన్నర్లతో ప్రత్యర్థిని కట్టడి చేయగలగడం ఆ జట్టు ప్రత్యేకత. భువనేశ్వర్‌ ఈసారి కూడా సన్‌రైజర్స్‌ బౌలింగ్‌ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. భువితో పాటు లెగ్‌ స్పిన్నర్‌ రషీద్‌ఖాన్‌, పేసర్లు బాసిల్‌ థంపి, సిద్ధార్థ్‌ కౌల్‌, సందీప్‌శర్మలతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉంది.
స్పాట్‌ ఫిక్సింగ్‌ వివాదంలో చిక్కుకుని ఐపీఎల్‌కు దూరమైన రాజస్థాన్‌కు రెండేళ్ళ తర్వాత ఇదే తొలి మ్యాచ్‌. రెండేళ్ళ విరామం తర్వాత పునరాగమనం చేసిన రాజస్థాన్‌కు ఆదిలోనే స్మిత్‌ రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. స్మిత్‌ గైర్హాజరీలో రహానె జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ రాజస్థాన్‌ జట్టులో స్టార్‌ ఆటగాడు. ఐతే వివాదాలతో జట్టుకు దూరమై ఇటీవలే పునరాగమనం చేసిన స్టోక్స్‌ ఏమేరకు రాణిస్తాడన్నది చూడాలి. ఇక రూ.11.5 కోట్లతో దక్కించుకున్న పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ తన ధరకు న్యాయం చేయగలడా అన్నది ఆసక్తికరం.

Share This Video


Download

  
Report form