IPL Final 2018: Chennai Super Kings VS Sunrisers Hyderabad Match Preview

Oneindia Telugu 2018-05-26

Views 191

Chennai Super Kings and Sunrisers Hyderabad will vie for the IPL glory on Sunday (May 27) here at the Wankhede Stadium. In this IPL edition, the Sunrisers have not beaten the Super Kings, losing all the three times they faced each other.
#chennaisuperkings
#sunrisershyderabad
#kanewilliamson
#msdhoni

49 రోజుల పాటు మొత్తం 59 మ్యాచ్‌లు... చివరి ఓవర్ వరకు ఉత్కంఠ... చివరకు రెండు జట్లు ఫైనల్‌కు చేరాయి. ఐపీఎల్ 11వ సీజన్‌లో చోటు చేసుకున్న దృశ్యం ఇది. టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో కోల్‌కతాపై 13 పరుగుల తేడాతో హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
తద్వారా ఐపీఎల్ 11వ సీజన్‌‌ పైనల్లో పాల్గొనే రెండు జట్లు ఖరారయ్యాయి. టోర్నీలో ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనున్న ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ఈ సీజన్‌లో చెన్నైతో తలపడిన మూడు సార్లు హైదరాబాద్ ఓటమిపాలైనా... తుదిపోరులో అమీ తుమీ తేల్చుకోనుంది.
ఐపీఎల్ ఫైనల్స్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ చేరడం ఇది రెండోసారి. ఐపీఎల్ 11వ సీజన్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటే అందులో 18 పాయింట్లతో సన్‌రైజర్స్ హైదరాబాద్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఖాతాలో కూడా 18 పాయింట్లు ఉన్నప్పటికీ, రన్ రేట్ తక్కువగా ఉండటంతో రెండో స్థానంలో నిలిచింది.
ఇరు జట్లు లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 9 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మే 22న ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో 2 వికెట్ల తేడాతో హైదరాబాద్ ఓటమి పాలైంది. దీంతో రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో కోల్‌కతాపై విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS