Sri Reddy about her new movie offer. She will take her protect to national level
టాలీవుడ్ లో నటి శ్రీరెడ్డి వ్యవహారం రోజు రోజుకు హీటెక్కుతోంది. మా అసోసియేషన్ మొత్తం కలసి చర్యని తిప్పికొట్టిన శ్రీరెడ్డి తగ్గడం లేదు. ఇటీవల శ్రీరెడ్డి ఫిలిం ఛాంబర్ ఎదుట అర్థ నగ్న ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. కాస్టింగ్ కౌచ్, తెలుగు వారికీ అవకాశాలు వంటి అంశాలపై ఆమె పోరాడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె సంచలన విషయాలు వెల్లడించడానికి కూడా వెనుకాడడం లేదు. టాలీవుడ్ లో కొందరు నటీ నటీనటులు శ్రీరెడ్డి వైఖరిని వ్యతిరేకిస్తుంటే, మరి కొందరు మద్దత్తు తెలుపుతున్నారు.ఓ ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
టాలీవుడ్ లో ఎప్పటికప్పుడు సంచనలం రేగుతూనే ఉంది. ఆమె మధ్యన డ్రగ్స్ వివాదం టాలీవుడ్ ని ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. తాజగా శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన విషయాలు వెల్లడిస్తూ హీటెక్కిస్తోంది.
తనకు అందరి హీరోయిన్లలాగా పెద్ద సినిమా అవకాశాలు ఇచ్చినా ఈ పోరాటం కొనసాగించేదాన్ని అని శ్రీరెడ్డి ఇంటర్వ్యూ లో వెల్లడించింది.
ప్రస్తుతం నా చేతిలో నాలుగు పెద్ద చిత్రాలు ఉన్నాయని శ్రీరెడ్డి వెల్లడించింది. అయినప్పటికీ తాను పోరాటం ఆపడం లేదు కదా అని శ్రీరెడ్డి తెలిపింది. దర్శకుడు తేజ రెండు చిత్రాల్లో అవకాశం ఇచ్చారు. మరో రెండు చిత్రాలు కూడా చేస్తున్నా అని శ్రీరెడ్డి తెలిపింది.
తాను నెల రోజులుగా పోరాటం చేస్తున్నా మా అసోసియేషన్ పట్టించుకోలేదని శ్రీరెడ్డి తెలిపింది. కానీ మొన్న కాసేపు అర్థ నగ్న ప్రదర్సన చేస్తే ఎదో కొంపలు మునిపోయినట్లు ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టారని ఎద్దేవా చేసింది.