Hours before the Chennai Super Kings and Kolkata Knight Riders tie, some pro-Tamil activists tried to stage a demonstration outside the MA Chidambaram stadium here against holding of the Indian Premier League (IPL) fixtures in Tamil Nadu amid the raging Cauvery protests.
మరి కొద్ది గంటల్లో చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై, కోల్‌కతా జట్టు ఐపీఎల్‌లో తమ రెండో మ్యాచ్‌ను ఆడనున్నాయి. ఇప్పటికే మ్యాచ్‌ను నిలిపివేయాలంటూ కోర్టులో కేసు ఫైల్ చేసినా, బీసీసీఐకి విజ్ఞప్తి చేసినా ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో చెన్నై ఆందోళనకారులు చెన్నైలోని స్టేడియం బయట మ్యాచ్ ను నిలిపివేస్తామంటూ సిద్ధమయ్యారు. కావేరీ నది ప్లెక్సీలు, ప్లకార్డులతో స్టేడియం బయట తమ నిరసన తెలుపుతున్నారు.
ఇప్పటికే ఆందోళన మొదలుపెడుతున్న కొంతమందిని పోలీసులు అదుపుచేసి అదుపులోకి తీసుకున్నారు. వారంతా చెన్నైలో మ్యాచ్ జరగకూడదంటూ నినాదాలతో ఉద్యమాన్ని రేకెత్తిస్తున్నారు. స్టేడియంను కూడా ముట్టడిస్తామని కొన్ని ప్రజా సంఘాలు హెచ్చరించాయి. దీంతో చెన్నైలో హై అలర్ట్ ప్రకటించారు. ప్రతికూలతను ముందుగానే ఊహించిన బీసీసీఐ దాదాపు 4000మంది పోలీసులతో భద్రతా దళాన్ని సిద్ధం చేసింది.
అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరించాయి. కొన్ని ప్రజా సంఘాలు మ్యాచ్‌ను అడ్డుకోవాలనే ఉద్దేశంతో టిక్కెట్లు కొన్నట్లు సమాచారం కూడా ఉందట. అందుకే స్టేడియంలోకి వచ్చేవారిపై పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని నిర్ణయించారు.
వాటర్ బాటిల్స్, ప్లకార్డులు వంటివాటిని తీసుకు రాకూడదని సూచించారు. అలాగే నల్ల దుస్తుల్ని కూడా అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. మొత్తం మీద కావేరీ సెగల ఎఫెక్ట్ ఐపీఎల్ మ్యాచ్‌ల మీద కూడా పడింది.