IPL-2018 Leads To An Interesting Scene Happened With Chris Gayle

Oneindia Telugu 2018-04-16

Views 802

Chris Gayle asked Dwayne Bravo to tie his shoe lays,Without any hesitation Bravo Completed the task.

ఐపీఎల్ 11వ సీజన్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో క్రిస్ గేల్‌కు అవకాశం ఇవ్వని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం కీలమైన చెన్నై సూపర్ కిoగ్స్ తో మ్యాచ్‌లో ఆడే అవకాశాన్ని పంజాబ్ కల్పించింది.
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగిన క్రిస్ గేల్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి అద్భుత ప్రదర్శన చేయడంతో పవర్ ప్లేలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 75 పరుగులు చేసింది. గేల్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలో క్రిస్ గేల్‌తో కలిసి రాహుల్ మాట్లాడుకుంటూ క్రీజులో అడుగుపెట్టాక.. బ్రావో అటుగా వెళ్తూ కనిపించాడు. దీంతో బ్రావోను పిలిచిన గేల్.. తన షూ లేస్‌ను బిగించి కట్టమన్నాడు.
వెంటనే బ్రావో నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ.. గేల్ షూ లేస్ బిగించి కట్టాడు.

Share This Video


Download

  
Report form