Shikae dhawan makes fun of his co-players
టీమిండియా క్రికెటర్ శిఖర్ ధావన్ జట్టులోని సహచర ఆటగాళ్లను ఆటపట్టించడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఆడేందుకు ఇప్పటికే మొహాలీ చేరుకుంది.
అయితే మొహాలీ చేరుకునేందు హైదరాబాద్ నుంచి విమానంలో బయల్దేరిన సహచర ఆటగాళ్లను ధావన్ ఓ ఆటాడుకున్నాడు. విమానం ఎక్కగానే చాలా మంది ఆటగాళ్లు నిద్రలోకి జారుకున్నారు. ధావన్‌కి నిద్ర రాలేదు. దీంతో హాయిగా నిద్రపోతున్న బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ ఉల్ హసన్, ఆఫ్ఘన్ ప్లేయర్ రషీద్ ఖాన్‌లను ఆటపట్టించాడు.
ఈ ఇద్దరూ విమానం ఆదమరిచి నిద్రపోతున్న సమయంలో ధావన్ ఓ పేపర్ ముక్కను చుట్టి వాళ్ల ముక్కుల్లో పెట్టడంతో ఏం జరిగిందో తెలియక సడెన్‌గా వాళ్లు మేల్కొన్నారు. అయితే, తమ నిద్రకు భంగం కలిగించిన ధావన్‌ను వీరిద్దరూ ఏం అనలేదు. ధావన్ చిలిపి చేష్టలను చూసి విమానంలో ఉన్న వారంతా నవ్వుతూనే ఉన్నారు.
ఇందుకు సంబంధించిన వీడియోని సన్‌రైజర్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్ తన తదుపరి మ్యాచ్ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో గురువారం తలపడనుంది. మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో ఆడిన మొదటి మూడు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.