Ileana D'Cruz responds on pregnant news. Actress clears the air with an Instagram pic.
గత కొన్ని రోజులు ఇలియాన గర్భవతి అంటూ మీడియాలో తెగ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రైడ్ చిత్రంలో అజయ్ దేవ్ గన్ తో నటించిన తరువాత ఇలియానా ఎక్కువగా తేలిక పాటి దుస్తుల్లో కనిపించింది. ఎప్పుడో ట్రెండీ దుస్తుల్లో సెగలు పుట్టించే ఇలియానా ఇలా డ్రెస్సింగ్ స్టైల్ మార్చడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఇలియానా గర్భవతి అయిందని, అది తెలియకుండా తేలిక పాటి దుస్తులు ధరిస్తోందని రూమర్లు వ్యాపించాయి. ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసియందే. వారిద్దరికీ వివాహం అయిపోయిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ వార్తల గురించి ఇలియానా స్పందించకపోయినా, తనకు గర్భం అంటూ వస్తున్న రూమర్స్ పై స్పందించింది.
ఇంస్టాగ్రామ్ లో స్కిన్ టైట్ దుస్తులు ధరించి తనకు ప్రెగ్నెన్సీ లేదని క్లారిటీ ఇచ్చింది. ఈ ఫోటోలు స్వయంగా తన ప్రియుడు ఆండ్రూ తీశాడని ఈ నడుము సుందరి తెలిపింది. సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్ళాక ఇలియానాకు ఒకటి అరా మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి.