No doubt Sai Pallavi is the best actor In South film Industry. Her performance in Fidaa, MCA, Kanam are tremoundous. But she is always in the news for wrong reason. Now her differences with Sharwanand goes viral in the media. On that Issue Sai Pallavi given clarity.
#SaiPallavi
#MCA
#Kanam
#Sharwanand
#media
#Fidaa
దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందం, అభినయంతో ఆకట్టుకొంటున్న హీరోయిన్ సాయిపల్లవి. ఇటీవల చిత్రాల్లో ఆమె నటనకు, డ్యాన్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రతిభకు తగినట్టే ప్రశంసలు అందుకొంటున్న సాయిపల్లవి చుట్టూ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ప్రధానంగా టాలీవుడ్‌లో పలువురు హీరోలతో షూటింగ్ సందర్భంగా విభేదాలు చోటుచేసుకొన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా పడిపడి లేచే మనుసు చిత్రంలో హీరో శర్వానంద్‌తో విభేదాలు వచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై సాయి పల్లవి వివరణ ఇచ్చారు. అసలేం జరిగిందంటే...
సాయిపల్లవి, శర్వానంద్ మధ్య విభేదాలు తలెత్తాయనే వార్త టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిద్దరి గొడవ కారణంగా షూటింగ్‌కు అంతరాయం కలిగింది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే శర్వానంద్‌తో విభేదాల వార్తను సాయిపల్లవి కొట్టిపడేశారు. ఆ కథనాల్లో పేర్కొనదంతా అవాస్తవమే అని దానిపై వివరణ ఇచ్చారు.