IPL 2018: Dhoni Bagged another New Record

Oneindia Telugu 2018-05-03

Views 20

Former India batsman Aakash Chopra believes that Chennai Super Kings have the best batting unit in this year's Indian Premier League and the way their skipper Mahendra Singh Dhoni has rewound the clock is sensational.
ఐపీఎల్ 11వ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ముఖ్యంగా చెన్నై విజయాల్లో అంబటి రాయుడు, జట్టు కెప్టెన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్‌గా పేరున్న ధోని, ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చెన్నై ఆడిన అనేక మ్యాచ్‌ల్లో చివరి వరకూ నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఇటీవల ఐపీఎల్‌లో ఓ జట్టుకు కెప్టెన్‌గా 150కి పైగా విజయాలందించిన ఏకైక కెప్టెన్‌గా అరుదైన ఘనతను సాధించాడు.
తాజాగా ధోని ఖాతాలోకి మరో రికార్డు వచ్చి చేరింది. అదేంటంటే ఐపీఎల్‌ 11వ సీజన్‌లో ఇప్పటి వరకూ చివరి ఐదు ఓవర్లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా మరో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ధోనీ ఎనిమిది మ్యాచ్‌లాడి మొత్తం 286పరుగులు సాధించాడు. అయితే ఇందులో 169 పరుగులు చివరి ఐదు ఓవర్లలోనే సాధించడం విశేషం.
#IPL 2018
#Dhoni
#CSK

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS