Biopic on the acting legend Savitri is to scan the pages of South Indian film history, according to Telugu director Nag Ashwin. “It's difficult to separate cinema, history and her,” Ashwin said about his film Mahanati, which stars Keerthy Suresh as the screen goddess and Dulquer Salmaan as her partner. Latest reports says that Keerthy Suresh charging heavy remuneration for this film.
#Mahanati
#KeerthySuresh
#DulquerSalmaan
మరో రెండు రోజుల్లో (మే 9న ) మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన 'మహానటి' సినిమా విడుదల కానుంది. అందరి దృష్టి ఈ సినిమాపై ఉన్నాయి. మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. మోహన్ బాబు ఈ సినిమాలో ఎస్విఆర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
యువ దర్శకుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో సమంత, విజయ్ దేవరకొండ ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు. సావిత్రి జీవిత చరిత్రను వీరిద్దరూ ప్రేక్షకులకు చెప్పబోతున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్వప్న, ప్రియాంక దత్‌లు నిర్మించారు.
సావిత్రి జీవితం గురించి అందరికి తెలిసిందే అయినప్పటికీ ఆమె గురించి తెలియని కొన్ని అంశాలు ఈ సినిమలో చెప్పడం జరిగిందని సమాచారం. ఆమె ఎందరికో అభిమాన తారగా ఎదిగారు. ఆమె జీవితాన్ని మొత్తం తీయాలంటే రెండు మూడు పార్ట్‌లు కూడా చాలవని చిత్ర బృందం చెబుతోంది.
మహానటి సినిమాలో టైటిల్ పాత్రలో నటించినటువంటి కీర్తి సురేష్ ఈ సినిమా కోసం కోటి యాభై లక్షలు తీసుకుందని సమాచారం. ఈ హీరోయిన్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుందని సమాచారం. కీర్తి సురేష్ ఇంతమొత్తంలో చార్జ్ చేసిన మొదటి సినిమా ఇదే అవ్వడం విశేషం. కీర్తి సురేష్ రెమ్యునరేషన్ విషయం తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు.