Mega Star Chiranjeevi Emotional words About Mahanati Savitri. Chiru remembers Punadi rallu movie
#Mahanati
#Chiranjeevi
లెజెండ్రీ నటి సావిత్రి బయోపిక్ మహానటి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు. మహానటి చిత్రం కోసం అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఆ క్షణం రాణే వచ్చింది. నేడు మహానటి చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవర కొండ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో బైట్ ద్వారా సావిత్రితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
తెలుగు చలన చిత్ర రంగంలో సావిత్రికి ప్రత్యేక స్థానం ఉంటుంది. నటీమణులు ఎందరో ఉన్నారు కానీ సావిత్రి మాత్రమే మహానటి అని మెగాస్టార్ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాదిరాళ్ళు. ఆ చిత్రం ద్వారా తనకు మాత్రమే ఓ అదృష్టం దక్కిందని చిరు అన్నారు. తన సినీ జీవితానికి పునాది వేసిన పునాదిరాళ్ళు చిత్రంలో సావిత్రమ్మతో నటించానని అన్నారు. తొలి చిత్రంలోనే ఆమెతో నటించడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు.
గ్లిజరిన్ లేకుండానే కన్నీళ్లు రప్పించగల సహజనటి సావిత్రి మాత్రమే అని చిరు అన్నారు. కళ్ళతోనే అద్భుతమైన హావభావాలు పలికించడం, తాను కదలకుండా కథని నడిపించగలగడం సావిత్రమ్మ ప్రత్యేకతలని చిరు అన్నారు.
నటిగా, వ్యక్తిగా, అమ్మగా సావిత్రమ్మ ఈ చిరంజీవి మనసులో ఎప్పటికి చిరంజీవిగానే ఉంటుందని మెగాస్టార్ అన్నారు. సావిత్రి బయోపిక్ ద్వారా ఆమె చరిత్రని తెలియజేసే ప్రయత్నం చేస్తున్న మహానటి చిత్ర యూనిట్ కి చిరు శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ చిత్రం అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు.