IPL 2018: KXIP Vs RCB Match Preview

Oneindia Telugu 2018-05-14

Views 42

Having found some light at the end of the tunnel, Royal Challengers Bangalore will be keen to expose the chinks in Kings XI Punjab's armoury during their must-win Indian Premier League encounter here on Monday (May 14th).
#RoyalChallengersBangalore
#KingsXiPunjab
#Kohli
#Ashwin
#IPL2018


ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లు చివరి దశకు వచ్చాయి. నేడు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తలపడబోతోంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న పంజాబ్‌కు ఈ మ్యాచ్ చాలా కీలకమనే చెప్పాలి. ఇప్పటికే 11 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్.. ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెలిస్తే.. ఇంకొక్క విజయంతో సగౌరవంగా ప్లేఆఫ్స్‌కు వెళ్లిపోవచ్చు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో గనుక పంజాబ్ ఓడితే.. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు రాజస్థాన్, కోల్‌కతా కూడా ప్లేఆఫ్స్ బెర్తుల కోసం పోటీపడుతుండటంతో పంజాబ్‌కు మిగిలిన మూడు మ్యాచ్‌లు కీలకమనే చెప్పాలి.
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న ఆ జట్టు కనీసం విజయాల సంఖ్య అయినా పెంచుకోవాలని చూస్తోంది. అందుకే ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. కానీ ఈ జట్టుపై ఎలాంటి ఒత్తిడిలేదు. ఒత్తిడంతా పంజాబ్‌పైనే. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో ఓడితే ఆ జట్టుపై ఒత్తిడి మరింత పెరిగిపోతుంది. కాబట్టి ఎలాగైనా ఈ మ్యాచ్‌లో గెలవాలనే ఒత్తిడి ఆ జట్టు సభ్యులపై కచ్చితంగా ఉంటుంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS