బ్రిటన్ యువరాజు ప్రిన్స్ హ్యారీ, హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్ వివాహం అంగరంగ వైభంగా జరిగింది. రాజవంశానికి చెందిన ఈ జంట చేతిలో చేయి వేసుకొని అతిథులకు కన్నుల పండుగగా నిలిచారు. హ్యారీ, మేఘన్ పెళ్లికి హాలీవుడ్ సినీ తారలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
హ్యారీ, మేఘన్ వివాహం భారతీయ కాలమానం ప్రకారం శనివారం (మే 19)న లండన్‌లోని విండ్సర్ కాజిల్‌లోని సెయింట్ జార్జి చాపెల్ చర్చిలో అంగరంగ వైభవంగా జరిగింది. వైభవంగా జరిగిన పెళ్లి తంతును యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు.