AB de Villiers Announces His Retirement (Video)

Oneindia Telugu 2018-05-23

Views 425

Former South African captain and one of modern day cricket's best batsmen AB de Villiers has retired from all forms of cricket with immediate effect. The middle order batsman announced his retirement on Twitter.

క్రికెట్ అభిమానులకు నిజంగా ఇది చేదువార్త. అంతర్జాతీయ క్రికెట్‌కు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డివిలియర్స్ వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల ఏబీ డివిలియర్స్ మూడు ఫార్మాట్ల నుంచి తాను వైదొలగుతున్నట్లు బుధవారం తన ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశాన్ని పోస్టు చేశాడు.
ఇదే సరైన సమయమని చెప్పిన డివిలియర్స్ తన 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఈ సందర్భంగా డివిలియర్స్ 'తక్షణమే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయం తీసుకున్నా. 114 టెస్టు మ్యాచ్‌లు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడాను. మరొకరు నా స్థానాన్ని భర్తీ చేయాల్సిన సమయం వచ్చింది, నా టర్న్ వచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. నేను రిటైర్ అవుతున్నా' అని తెలిపాడు.

Share This Video


Download

  
Report form