MS Dhoni has always been key to Chennai Super Kings’ fortunes. This year too it hasn’t been any different. In fact, Dhoni, who had struggled for form in the last two IPL seasons for Rising Pune Supergiant, has found his mojo back as a batsman this season.
#sureshraina
#msdhoni
#ipl2018
#chennaisuperkings
ఐపీఎల్ 11వ సీజన్‌లో చెన్నై ఫైనల్‌కు చేరిపోయింది. శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ రెండింటిలో విజేతగా నిలిచిన జట్టు ఫైనల్‌లో చెన్నైతో పోరాడాలి. ఈ నేపథ్యంలో చెన్నై జట్టు భారీగా సమాయత్తమవుతోంది. ఇప్పటికే ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ ఏడోసారి ఫైనల్ చేరింది. ఆ జట్టు ఆడిన 9 ఏళ్లలో ఏడుసార్లు ఫైనల్ చేరగా రెండుసార్లు కప్ గెలిచింది.
ఈసారి ఎలాగైనా కప్ గెలుస్తామని, ధోనీకి గిఫ్ట్‌గా ఇస్తామని ఆ జట్టులోని కీలక ఆటగాడు సురేశ్ రైనా చెప్పాడు. ‘ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ చేరగానే ధోనీ ఎంతో ఎమోషనల్ అయ్యాడు. చెన్నై జట్టు గురించి అతడెంతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటాడు. 2008 నుంచి సూపర్ కింగ్స్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. నాకు తెలిసిన వాళ్లలో మంచితనం గురించి మాట్లాడాలంటే ధోనీ తర్వాతే ఎవరైనా. కాబట్టే, ఈసారి మేం ధోనీ కోసమే ఐపీఎల్ గెలవాలని అనుకుంటున్నాం' అని రైనా తెలిపాడు.
ఈసారి వేలం ముగిశాక చెన్నై జట్టు పెద్ద వయస్కులను జట్టులోకి తీసుకుందని ఎక్కడో చదివాను. కానీ ఆటగాళ్ల అనుభవాన్ని మేం సద్వినియోగం చేసుకుంటున్నాం. మా జట్టు ఎంతో నమ్మకంగా ఉంది. షేన్ వాట్సన్, రాయుడు చక్కటి ఆరంభాలు ఇచ్చారు. తర్వాత ధోనీతో కలిసి నేను బాగా ఆడాను. అంతా కలిసి ఓ జట్టుగా రాణించాం. మా అనుభవం ఉన్న ఆటగాళ్లతో కూడిన జట్టే కాదు మ్యాచ్ విన్నర్లున్న జట్టు కూడా. 2011 నుంచి మేం టైటిల్ గెలవలేదు. అందుకే ఈసారి గెలవాలనుకుంటున్నాం'' అని రైనా చెప్పాడు.