Dulquer Salmaan fans Rakul Preet. Rakul Preet did small mistake
#keerthysuresh
#DulquerSalmaan
#RakulPreet
మొన్నటి వరకు టాలీవడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం అవకాశాలు బాగా తగ్గాయి. కానీ యువతలో మాత్రం రకుల్ కు మంచి క్రేజ్ ఉంది. టాలీవడో లో చాలామంది స్టార్ హీరోగా సరసన రకుల్ నటించింది. తాజగా రకుల్ ప్రీత్ సింగ్ టార్గెట్ గా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మహానటి చిత్రం విషయంలో రకుల్ ప్రీత్ సింగ్ చేసిన చిన్న పొరపాటే దీనికి కారణం. మహానటి చిత్రం విడుదలై సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ఇటీవల విడుదలైన మహానటి చిత్రంపై సెలెబ్రిటీలంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో మహానటి చిత్రం గురించి తమ అభిప్రాయాలు తెలియజేస్తూ కీర్తి సురేష్ సహా ఇతర నటీనటులని ప్రశంసిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ కూడా మహానటి చిత్రం చూసి తన అభిప్రాయాన్ని తెలిపింది.
మహానటి చిత్రం మాస్టర్ పీస్ అంటూ ప్రశంసించింది. కీర్తి సురేష్ నటనతో అదరగొట్టిందని తెలిపింది. సమంత, విజయ్ దేవరకొండ కూడా చాలా బాగా నటించారని రకుల్ ప్రశంసించింది. కానీ ఈ చిత్రంలో మరో కీలక పాత్ర పోషించిన మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ని మాత్రం మరచిపోయింది.